‘తూర్పు’ న ఉదయించేదెవరు ?

ABN , First Publish Date - 2021-03-14T05:54:08+05:30 IST

‘తూర్పు’ న ఉదయించేదెవరు ?

‘తూర్పు’ న ఉదయించేదెవరు ?

విజయవాడ, పటమట, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : కార్పొరేషన్‌ ఎన్నికలలో ‘తూర్పు’న ఉదయించేవారెవరన్నది నేడు తేలిపోనుంది ! నేటి ఫలితం ఎలా ఉంటుందా అని తూర్పున బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు నరాలు తెగే టెన్షన్‌ను అనుభవిస్తున్నారు. విజయవాడ కార్పొరేషన్‌ను గెలుచుకోవటం అన్నది ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రధాన పార్టీ లు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపుపై ఎవరి లెక్కలు వారు చెబుతున్నా.. అంతర్గతంగా ఏదో భయం ! అభ్యర్థుల టెన్షన్‌కు మరికొద్ది గంటలలోనే ముగింపు పడనుంది. తూర్పు నియోజకవర్గం పరిధిలో క్రమ సంఖ్యలో 2 నుంచి 22  డివి జన్లు ఉన్నాయి. ఈ ప్రాతిపదికనే ఆదివారం లయోలా కాలేజీ లో జరగనున్న కౌంటింగ్‌లోనూ మొదటి రౌండ్‌లోనే ప్రాధా న్యత కల్పించారు. తొలి రౌండ్‌లోనే  విజయవాడ తూర్పు నియో జకవర్గం పరిధిలోని డివిజన్ల ఓట్ల లెక్కింపు ప్రారంభం  కానుంది. తూర్పు నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు హోరాహోరీగా తలపడ్డాయి. రెండు ప్రధాన పార్టీలు పదికొండు ప్లస్‌ వేసుకుంటున్నాయి.  టీడీపీకి ఆది నుంచి తూర్పు కంచుకోట ! కాంగ్రెస్‌, వామపక్షాలు బలంగా ఉన్న పూర్వపు రోజుల్లోనూ ఇక్కుడ టీడీపీ తన ఉనికిని చాటుకుంది. 2014లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 19 డివిజన్లు ఉండగా.. టీడీపీ 10 డివిజన్లను కైవ సం చేసుకుంటే వైసీపీ 9 డివిజన్లను కైవసం చేసుకుంది. రాష్ట్రంలో అధికారం మారిన పరిస్థితుల్లో .. విజయవాడ తూర్పు నియోజకవర్గంపై అందరి కళ్లూ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో టీడీపీ గట్టిగా 13 నుంచి 15 స్థానాల వరకు సాధించగలదని విశ్వశిస్తుండగా.. అధికార పార్టీ  నేతలు 15 సీట్లు ఖచ్చితంగా సాధించగలమని చెబుతు న్నారు. ప్రధాన పార్టీలు రెండూ కూడా 15 స్థానాల వరకు నికరంగా సాధించగలమని చెబుతున్నా.. ఆధిపత్యం మాత్రం ఏదో ఒక పార్టీకే ఉంటుంది. రెండు పార్టీలు తమ వాదనలు కరెక్టేనని చెప్పటానికి అనేక వాదనలు తీసుకువస్తున్నాయి. విజయవాడ నగరం అభివృద్ధి విషయంలో అధికార పార్టీ ఏమీ చేయలేకపోవటం తమకు కలిసి వస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. నగరానికి మెట్రో ప్రాజెక్టును సాకారం చేయ కుండా పక్కన పెట్టేయటం, కనీసం గ్రేటర్‌ హోదా కూడా కల్పించకుండా.. శివారు ప్రాంతాలను మునిసిపాలిటీలుగా ప్రక టించడం వంటివి విజయవాడ వాసులకు ఆగ్రహం తెప్పిం చాయని అంటున్నారు. ప్రభుత్వం నగరంలో వార్డు వలంటీర్ల వ్యవస్థ సక్రమంగా అమలు కాకపోవటం వల్ల ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారని, రేషన్‌ డోర్‌ డెలివరీ కూడా నగరంలో సవ్యంగా లేకపోవటం ప్రజల ఇబ్బందులు, అన్నింటికీ మించి వలస కూలీలు జీవనోపాధి మీద ప్రభావం చూపించటం వంటివి ప్రభుత్వ వ్యతిరేకంగా పనిచేస్తాయని టీడీపీ నాయ కులు బలంగా భావిస్తున్నారు. ఇవి తమ విజయానికి బాటలు పరుస్తాయని భావిస్తున్నారు. అధికార పార్టీ వైసీపీ నేతలు మాత్రం ప్రభుత్వంపై సానుభూతి, ప్రజా సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని చెబుతున్నారు. ప్రధానంగా పేదలకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రజల నుంచి ఆదరణ తీసుకువస్తుందని చెబుతున్నారు.  క్లాస్‌ ఓటింగ్‌ గతం కంటే పెరిగిందని ఇది తమకు లాభిస్తుందని టీడీపీ భావిస్తుండగా.. క్లాస్‌ ఓటింగ్‌లో మహిళల మద్దతు తమకు ఉందని వైసీపీ చెప్పుకుంటోంది. మరో వైపు రామలింగేశ్వరనగర్‌, రాణిగారి తోట, కృష్ణలంక ప్రాంతాలలో జనసేన బలమైన అభ్యర్ధులను నిలపడంతో వారు ఏ పార్టీ ఓట్లను చీల్చుతారనే అంశంపై చర్చ నడుస్తుంది.  అంతిమంగా ఓటరు ఏమి తీర్పు ఇస్తాడన్నది మరి కొద్ది గంటల్లో తేలనుంది.  

Updated Date - 2021-03-14T05:54:08+05:30 IST