నాపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు : ఈవో

ABN , First Publish Date - 2021-12-07T06:13:36+05:30 IST

నాపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు : ఈవో

నాపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు : ఈవో

విజయవాడ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : తనపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని దుర్గగుడి కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ తెలిపారు. ప్రభుత్వం, అధికారులు, ఆలయ సిబ్బంది, భక్తులు, ప్రజల సహకారాలతో గత 8 నెలలుగా ప్రశాంత వాతావరణంలో దుర్గమ్మ ఆలయంలో కార్యనిర్వహణ చేసే అవకాశం కలిగిందని పేర్కొన్నారు. ఈవో భ్రమరాంబ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో  ‘తలొగ్గలేఖ?’ శీర్షికన వెలువడిన కథనంపై ఆమె స్పందించారు. అడిషనల్‌ కమిషనర్‌ స్థానం కోసం తాను ఎవరి వద్దకు వెళ్లి రిక్వెస్ట్‌ చేయలేదని, తనకంటే సీనియర్‌ అధికారులు ఉన్నందున పదోన్నతి పొందాలన్న ఆశ కూడా లేదని స్పష్టం చేశారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు నెల రోజుల ముందే దరఖాస్తు సమర్పించానని, తనకు కాకుండా వేరొకరికి పదోన్నతి ఇచ్చినందున మనస్తాపానికి గురై స్వచ్ఛంద పదవీ విరమణకు లేఖ సమర్పించాననటం వాస్తవం కాదని ఖండించారు. శానిటేషన్‌ కాంట్రాక్ట్‌ టెండరు విషయంలో నిబంధనలు, కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్ణయం తీసుకుంటా మన్నారు.

Updated Date - 2021-12-07T06:13:36+05:30 IST