ఈవోను కలిసిన డీఆర్‌బీ గురుభవానీ పీఠం ప్రతినిధులు

ABN , First Publish Date - 2021-10-19T06:16:19+05:30 IST

ఆలిండియా భవానీ దీక్షా ఛారిట బు ల్‌ ట్రస్ట్‌ ఏపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తంగెళ్ల నానాజీ, రాష్ట్ర కార్యదర్శి దవరసింగి రాంబాబు గురుభవానీ, విశాఖ జి ల్లా ఉపమాక గురుభవానీ పీఠం ప్రతినిధులు సోమవా రం దుర్గమ్మను దర్శించుకున్నారు.

ఈవోను కలిసిన డీఆర్‌బీ గురుభవానీ పీఠం ప్రతినిధులు

విజయవాడ : ఆలిండియా భవానీ దీక్షా ఛారిట బు ల్‌ ట్రస్ట్‌ ఏపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తంగెళ్ల నానాజీ, రాష్ట్ర కార్యదర్శి దవరసింగి రాంబాబు గురుభవానీ, విశాఖ జి ల్లా ఉపమాక గురుభవానీ పీఠం ప్రతినిధులు సోమవా రం దుర్గమ్మను దర్శించుకున్నారు. దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించినందుకు ఈవో భ్రమరాంబ ను దుశ్శాలువాతో సత్కరించి ఉపమాక వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహూకరించారు. నవంబరు నుంచి ప్రారంభమయ్యే చండీదీక్షలనూ విజయవంతం చేసేందు కు భవానీలందరూ సహకరించాలని ఈవో భ్రమరాంబ కోరారు. ఉపమాక డీఆర్‌బీ గురుభవానీ ఉపమాక పీఠం ప్రతినిధులు చొప్పా శ్రీనివాసరావు, మీసాల సత్తిబాబు, భరద్వాజ్‌, తంగెళ్ల శ్రీనివాసరావు, గంగోత్రి పణ్రతి, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T06:16:19+05:30 IST