డ్రోన్‌ టెక్నాలజీ రంగంలో ఉపాధి మెండు

ABN , First Publish Date - 2021-02-26T06:38:58+05:30 IST

డ్రోన్‌ టెక్నాలజీలో పట్టు సాధించిన విద్యార్థులకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని కేబీఎన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఇ.వరప్రసాద్‌ అన్నారు.

డ్రోన్‌ టెక్నాలజీ రంగంలో   ఉపాధి మెండు

డ్రోన్‌ టెక్నాలజీ రంగంలో 

ఉపాధి మెండు

వన్‌టౌన్‌, ఫిబ్రవరి 25 : డ్రోన్‌ టెక్నాలజీలో పట్టు సాధించిన విద్యార్థులకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని కేబీఎన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఇ.వరప్రసాద్‌ అన్నారు. ఆ కళాశాలలో నూతనంగా ప్రవేశపెట్టిన డిప్లొమో ఇన్‌ డ్రోన్‌ పైలెట్‌ కోర్సు ప్రారంభోత్సవ కార్య క్రమాన్ని కళాశాల ప్రాంగణంలో గురువారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి తూనుకుంట్ల శ్రీనివాసు జ్యోతి వెలిగించి తరగతులను ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపాల్‌ వరప్రసాద్‌ మాట్లాడుతూ  సాంకేతిక నైపుణ్యాన్ని అందించేందుకు డ్రోన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (తిరుపతి)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. ఇన్‌స్టిట్యూట్‌ ఎగ్జిక్యూటివ్‌ హెడ్‌ తహీర్‌ షేక్‌ మాట్లాడుతూ డ్రోన్‌ టెక్నాలజీలో రోజు రోజుకు అవకాశాలు విస్తృతమవుతున్నాయన్నారు. అనంతరం డ్రోన్‌లతో విన్యాసాలను నిర్వహించారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.నవీన్‌కుమార్‌, అకడమిక్‌ డైరెక్టర్‌ పి.ఎల్‌.రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-02-26T06:38:58+05:30 IST