ప్రమాదం అంచున..
ABN , First Publish Date - 2021-02-01T06:47:40+05:30 IST
డ్రెయిన్ నిర్మాణం కోసం తవ్విన గోతులు అలాగే వదిలేయటంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు, చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అసంపూర్తిగా డ్రెయిన్ నిర్మాణం ఫ గోతులు తవ్వి వదిలేసిన వైనం
ఉయ్యూరు, జనవరి 31 : డ్రెయిన్ నిర్మాణం కోసం తవ్విన గోతులు అలాగే వదిలేయటంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు, చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక 14వ వార్డులోని గ్రంథాలయం, ప్రాథమిక పాఠశాల రోడ్‌లో నిర్మిస్తున్న డ్రెయిన్ నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేశారు. సుందరమ్మ పేట నుంచి పశువైద్యశాల, గ్రంథాలయం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రోడ్డు పక్కన పక్కా డ్రెయిన్ నిర్మాణం నిమిత్తం పెద్ద గోతులు తవ్వారు. కాంక్రీట్ నిర్మాణం చేసి దానిపై మూత వేయకుండా వదిలేయటమే కాక గోతులను కూడా పూడ్చకుండా నిలిపేశారు. పాఠశాలకు వెళ్లే గేటు ఎదుట డ్రెయిన్‌పై తాత్కాలికంగా ఓ బల్ల వేసి చేతులు దులుపుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నుండి ప్రాథమిక పాఠశాలలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో పిల్లలను పాఠశాలకు పంపేందుకు తల్లితండ్రులు వెనకాడుతున్నారు. అంతేకాక రాత్రివేళ రోడ్డుపై వెళ్లేవారు ఆ గోతుల్లో పడి గాయాలపాలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డ్రెయిన్‌కు మూతవేసి, గోతులను తక్షణం పూడ్చివేయాలని వారు డిమాండ్ చేశారు.