బాల్య వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత
ABN , First Publish Date - 2021-02-26T06:38:54+05:30 IST
బాల్య వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఐసీడీఎస్ సీడీపీవో జయలక్ష్మి, ఎంపీడీవో బసవరాజు అచ్యుత సత్యనారయణ అన్నారు.

ఐసీడీఎస్ సీడీపీవో జయలక్ష్మి
ముసునూరు, ఫిబ్రవరి 25 : బాల్య వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఐసీడీఎస్ సీడీపీవో జయలక్ష్మి, ఎంపీడీవో బసవరాజు అచ్యుత సత్యనారయణ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో గురువారం బేటి బచావో - బేటి పడావోలో భాగంగా బాల్య వివాహాలు, లింగవివక్ష, బాలికలపై జరుగుతున్న ఆత్యాచారాల నిర్మూలనపై అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, సచివాలయ ఉద్యోగులకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అవగహన సదస్సు జరిగింది. సీడీపీవో మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను కిషోర బాలికలు, తల్లిదండ్రులకు వివరించాలన్నారు. గ్రామాల్లో బాల్యవివాహాలు జరుగుతుంటే వెంటనే అంగన్‌వాడీలకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు. ఎంపీడీవో మాట్లాడుతూ బాలికా విద్యాను ప్రోత్సహించాలని, అంగన్‌వాడీల ద్వారా అందించే పౌష్ఠికాహారాన్ని గర్భణులు, బాలింతులు, చిన్నారులు వినియోగించుకోవాలన్నారు. సూపర్‌వైజర్లు శ్రీలక్ష్మి, లక్ష్మి, సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు.