జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌గా పూర్ణమ్మ బాధ్యతల స్వీకారం

ABN , First Publish Date - 2021-12-30T06:35:12+05:30 IST

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌గా పూర్ణమ్మ బాధ్యతల స్వీకారం

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌గా పూర్ణమ్మ బాధ్యతల స్వీకారం
జమలపూర్ణమ్మకు పుష్పగుచ్ఛం ఇస్తున్న మంత్రి వెలంపల్లి

గవర్నర్‌పేట, డిసెంబరు 29 : కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌గా టి.జమలపూర్ణమ్మ బుధవారం ఎంజీ రోడ్డులోని ఠాగూర్‌ స్మారక గ్రంథాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌, రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ చైౖర్మన్‌ అడపా శేషు, జాయింట్‌ కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌ పూర్ణమ్మను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ జిల్లా కార్యదర్శి కె.నాగరాజు, ఏ.రామచంద్రుడు, కె.మధుసూదనరాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-30T06:35:12+05:30 IST