తప్పులు బయటపడతాయనే రహస్య బాట

ABN , First Publish Date - 2021-08-28T04:57:14+05:30 IST

తప్పులు బయటపడతాయనే రహస్య బాట

తప్పులు బయటపడతాయనే రహస్య బాట

సీఎం జగన్‌పై దేవినేని ఉమా ఫైర్‌

గొల్లపూడి, ఆగస్టు 27 : ప్రభుత్వ జీవోలను దాచి పెట్టారు, అప్పుల లెక్కల గుట్టు విప్పరు, పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ రద్దు చేశారు, టీడీపీ పారదర్శక పాలనకు మంగళం పాడారు.. అంటూ మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం తన ట్విటర్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘ఆర్థిక వ్యవహారాలు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు. ప్రజాధనం గురించి ప్రజలకు తెలియకూడదా? చేసిన తప్పులు బయట పడతాయనే ఈ రహస్య బాట పట్టారా’ అంటూ సీఎం జగన్‌ను ప్రశ్నించారు. 

Updated Date - 2021-08-28T04:57:14+05:30 IST