షాక్ కొడుతున్న విద్యుత్ బిల్లులు: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2021-10-25T17:36:02+05:30 IST

టీడీపీ నేత దేవినేని ఉమ మహేశ్వరరావు ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

షాక్ కొడుతున్న విద్యుత్ బిల్లులు: దేవినేని ఉమ

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వినియోగదారులకు విద్యుత్ బిల్లులు షాక్ కొడుతున్నాయన్నారు. టీడీపీ హయాంలో కరెంట్ యూనిట్ రూ.4కు కొంటే.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ గగ్గోలు పెట్టారని విమర్శించారు. ఇప్పుడు కమీషన్లకక్కుర్తితో యూనిట్ రూ.20లకు కొంటున్నారని ఆరోపించారు. ప్రజలపై భారీగా భారం మోపారని మండిపడ్డారు. చార్జీల బాదుడుపై నిరసనలతో రోడ్డెక్కుతున్న ప్రజల ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికే బూతుల పంచాంగం తెచ్చారని దేవినేని ఉమ దుయ్యబట్టారు. 

Updated Date - 2021-10-25T17:36:02+05:30 IST