ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై దాడులా?: శావల దేవదత్‌

ABN , First Publish Date - 2021-12-28T06:21:12+05:30 IST

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై దాడులా?: శావల దేవదత్‌

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై దాడులా?: శావల దేవదత్‌

తిరువూరు, డిసెంబరు 27: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ప్రజలపై వివిధ రూపాల్లో ఆర్థిక భారం మోపుతోందని, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై నాయకులు భౌతిక దాడులకు దిగుతున్నారని..ఇది సమంజసమేనా? అని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి శావల దేవదత్‌ ప్రశ్నించారు. వైసీపీ ప్రజాకంటక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని 14, 15 వార్డుల్లో టీడీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం బజార్‌లో గౌరవసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కంటే ఆర్థిక లోటును పూడ్చుకోవటానికే ప్రాధాన్యం ఇస్తుందని, ఎప్పుడో నిర్మించుకున్న ఇళ్లకు ఓటీఎస్‌ పేరుతో పేదల నుంచి నగదు వసూలుకు పాల్పడుతోందన్నారు. ఈ పథకం స్వచ్ఛందమని ఓ వైపు చెబుతూనే, మరోవైపు ఓటీఎస్‌ చెల్లించకుంటే ఇతర పథకాలు రద్దు చేస్తామనే బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు రద్దుచేసి ప్రజలపై భారాలు మోపడమే ఈ ప్రభుత్వం సాధించిన ఘనతని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొమ్మసాని మహేష్‌ అధ్యక్షతన నిర్వహించిన సభలో సింధు శ్రీను, వాసం మునియ్య, కామాల రామారావు, మరకాల కృష్ణకుమారి, పానుగంటి ఉషరాణి, మాధవి, మార్కేండేశ్వరరావు, బండి ముత్యం పాల్గొన్నారు.


Updated Date - 2021-12-28T06:21:12+05:30 IST