మన కోసం - మనం ట్రస్ట్‌కు రూ.2 లక్షల విరాళం

ABN , First Publish Date - 2021-07-12T06:53:57+05:30 IST

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమాభిలాషి దాసరి రామమోహనరావు సోమవారం 90వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా చల్లపల్లి గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తున్న మన కోసం - మనం ట్రస్ట్‌కు రూ.2 లక్షలు విరాళంగా ఇచ్చారు.

మన కోసం - మనం ట్రస్ట్‌కు రూ.2 లక్షల విరాళం

చల్లపల్లి : స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమాభిలాషి దాసరి రామమోహనరావు  సోమవారం 90వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా చల్లపల్లి గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తున్న మన కోసం - మనం ట్రస్ట్‌కు రూ.2 లక్షలు విరాళంగా ఇచ్చారు. గతంలో ఇచ్చిన రూ.14 లక్షలతో కలిపి ఇప్పటి వరకు ఆయన రూ.16 లక్షలు ట్రస్టుకు అందజేశారు. మన కోసం మనం ట్రస్టు ఉద్యోగులకు, పద్మావతి ఆసుపత్రి ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున అందజేశారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో నూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తూ స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు శుభాకాంక్షలు  తెలిపారు. రా మ్మోహనరావుకు స్వచ్ఛ కార్యకర్తలు, సిబ్బంది తరపున కుమారుడు స్వచ్ఛ చల్లపల్లి సారఽథి, డాక్టర్‌ డిఆర్కే.ప్రసాద్‌, డాక్టర్‌ పద్మావతి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.  

Updated Date - 2021-07-12T06:53:57+05:30 IST