దళిత, గిరిజనుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-11-02T06:45:05+05:30 IST

దళిత, గిరిజనుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

దళిత, గిరిజనుల సమస్యల పరిష్కారంలో  రాష్ట్ర ప్రభుత్వం విఫలం

ఎస్సీ, ఎస్టీ హక్కుల పోరాట సమితి నేత ఏలియా

కంకిపాడు, నవంబరు 1 : దళిత, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్సీ, ఎస్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఇంటూరి ఏలియా అన్నారు. కంకిపాడులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సోమవారం నూతన కమిటీ వివరాలను ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఏలియా మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తరువాత ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌ ఊసేలదన్నారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ నిధులు పక్కదారి పట్టించారని మండిపడ్డారు.  నూతన కమిటీ అధ్యక్షుడిగా ఇంటూరి ఏలియా, ప్రధాన కార్యదర్శిగా కుంబా ప్రభుదాసు, ఉపాధ్యక్షుడిగా కూచిపూడి ప్రకాశరావు, కోశాధికారిగా ఉయ్యాల ఏడుకొండలు, కార్యదర్శిగా అద్దేపల్లి సుందరరావు, సభ్యు లుగా వెంకట శివయ్య, కాజా వసంత కుమార్‌ను ఎన్నుకున్నారు. 

Updated Date - 2021-11-02T06:45:05+05:30 IST