వైఎస్‌ఆర్‌ పీకేఎం క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-01-20T06:50:21+05:30 IST

వైఎ్‌సఆర్‌ పీకేఎం కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను పద్మావతి మహిళా కళాశాల క్రీడా ప్రాంగణంలో మంత్రి కొడాలి నాని మంగళవారం ప్రారంభించారు.

వైఎస్‌ఆర్‌ పీకేఎం క్రికెట్‌ టోర్నమెంట్‌  ప్రారంభం

మచిలీపట్నం టౌన్‌ : వైఎ్‌సఆర్‌ పీకేఎం కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను పద్మావతి మహిళా కళాశాల క్రీడా ప్రాంగణంలో మంత్రి కొడాలి నాని మంగళవారం ప్రారంభించారు. కొడాలి నాని టాస్క్‌ వేసి, బ్యాటింగ్‌ చేసి పోటీలను ప్రారంభించారు. మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ షేక్‌ సిలార్‌దాదా బౌలింగ్‌ చేయగా, కొడాలి నాని బ్యాటింగ్‌ చేశారు. 32 టీమ్‌లు పాల్గొంటున్నాయని టోర్నమెంట్‌ నిర్వాహకులు,  మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కృష్ణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో బందరు ఆర్డీవో ఖాజావలి, నగర పాలక సంస్థ కమిషనర్‌ శివరామకృష్ణ, తహసీల్దార్‌ సునీల్‌బాబు, మార్కెట్‌ యార్డు చైర్మన్‌, వైస్‌చైర్మన్లు షేక్‌ అచ్చాబా, తోట సత్యనారాయణ, అర్బన్‌ బ్యాంకు మాజీ చైర్మన్‌ బొర్రా విఠల్‌, మాదివాడ రాము, గాజుల భగవాన్‌, బందెల థామస్‌ నోబుల్‌, గుప్తా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-20T06:50:21+05:30 IST