పెట్రోలు, డీజిల్ ధరలు నియంత్రించాలి
ABN , First Publish Date - 2021-10-29T06:43:31+05:30 IST
పెట్రోలు, డీజీల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలంటూ మచిలీపట్నం బుట్టాయిపేట సెంటర్‌లో సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్ ) నాయకులు ధర్నా నిర్వహించారు.
లారీ యజమానులు, సీపీఐ, సీపీఎం ధర్నా
మచిలీపట్నం టౌన్, అక్టోబరు 28 : పెట్రోలు, డీజీల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలంటూ మచిలీపట్నం బుట్టాయిపేట సెంటర్‌లో సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్ ) నాయకులు ధర్నా నిర్వహించారు. సీపీఐ నాయకులు మోదుమూడి రామారావు, సీపీఎం నాయకులు కొడాలి శర్మ మాట్లాడారు. ఏఐటీయూసీ నాయకులు లింగం ఫిలిప్, వై. ఈశ్వరరావు, సీపీఎం నాయకులు బి. సుబ్రహ్మణ్యం, సిహెచ్. జయరావు, బసవపున్నయ్య, పోలినాయుడు, ఈడే రామారావు, జె.గగన్ పాల్గొన్నారు. పెడన : పెట్రోలు, డీజీల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకుల పెరుగు దలను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం పెడనలో ధర్నా నిర్వహించారు. సీపీఎం నాయకులు గోరు రాజు, పంచల నరసింహారావు, వాసా గంగాధరరావు, ఉట్ల పేరయ్యలింగం, సీపీఐ నాయకులు కట్టా హేమసుం దరరావు, కుర్మా విఘ్నేశ్వరరావు, రావూరి భాస్కరరావు పాల్గొన్నారు. గుడివాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టోల్ ట్యాక్స్, పెట్రోలు, డీజిల్‌పై అత్యధిక పన్నులు వసూలు చేస్తూ రవాణ రంగాన్ని మోయలేని భారంగా మార్చాయని లారీ యజమానులు, ట్రాన్స్‌పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుడివాడ అధ్యక్షుడు అడుసుమిల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. నెహ్రూ చౌక్‌లో గురువారం సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రోలు, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదని పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే రవాణా రంగం పూర్తిగా కుదేలైందని రోజూ 30 పైసల చొప్పున పెంచడం దారుణమని అన్నారు. ప్రభుత్వాలు స్పందించకపోతే దేశవ్యాప్త సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. సంఘం కార్యదర్శి గోళ్ల శివ, పాలకవర్గ సభ్యులు, లారీల యజమానులు పాల్గొన్నారు. కగా, పెంచిన వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వై.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. స్థానిక నెహ్రూ చౌక్‌లో గురువారం సీపీఎం ఆధ్వర్యంలో ధరల పెరుగుదలకు నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి ఆర్.సి.పి.రెడ్డి, పట్టణ నాయకులు లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.
