హోంఐసోలేషన్‌ వారికి సీపీఐ నేత సాయం

ABN , First Publish Date - 2021-05-30T07:00:25+05:30 IST

కరోనా బారిన పడి ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద వర్గాలకు తామున్నాం అంటూ సీపీఐ నేతలు భరోసా ఇస్తున్నారు. సీపీఐ 58వ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యాన అజిత్‌సింగ్‌నగర్‌లో హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారికి సీపీఐ నేత కె.వి.భాస్కరరావు ఇంటింటికి వెళ్లి మందులు, పౌష్టికాహారం, పండ్లు పంపిణీ చేస్తున్నారు.

హోంఐసోలేషన్‌ వారికి సీపీఐ నేత సాయం
ఇంటింటికి వెళ్లి పోషకాహారం అందజేస్తున్న సీపీఐ నేత కె.వి.భాస్కరరావు

అజిత్‌సింగ్‌నగర్‌, మే 29 : కరోనా బారిన పడి ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద వర్గాలకు తామున్నాం అంటూ సీపీఐ నేతలు భరోసా ఇస్తున్నారు. సీపీఐ 58వ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యాన అజిత్‌సింగ్‌నగర్‌లో హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారికి సీపీఐ నేత కె.వి.భాస్కరరావు ఇంటింటికి వెళ్లి మందులు, పౌష్టికాహారం, పండ్లు పంపిణీ చేస్తున్నారు. అవసరమైన వారికి భోజనాలు అందిస్తున్నారు. ధైర్యంగా ఉండి కరోనాను జయించాలని, జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేస్తున్నారు. అవసరమైతే తమకు కాల్‌ చేయాలని ఫోన్‌ నెంబర్లు ఇస్తున్నారు. డివిజన్‌ పరిధిలోని వంద కుటుంబాలకు శనివారం ఆయన పోషకాహారం పంపిణీ చేశారు. 

Updated Date - 2021-05-30T07:00:25+05:30 IST