విధినిర్వహణలో అప్రమత్తంగా ఉండండి

ABN , First Publish Date - 2021-12-19T06:11:33+05:30 IST

విధి నిర్వ హణలో బాధ్యతగా, అప్రమత్తంగా ఉండా లని భవానీపురం పోలీసు సిబ్బందికి పోలీసు కమిషనర్‌ కాంతిరాణా సూచిం చారు.

విధినిర్వహణలో అప్రమత్తంగా ఉండండి

విధినిర్వహణలో అప్రమత్తంగా ఉండండి

 భవానీపురం పీఎస్‌ను సందర్శించిన సీపీ కాంతిరాణా

వన్‌టౌన్‌, డిసెంబరు 18:  విధి నిర్వ హణలో బాధ్యతగా, అప్రమత్తంగా ఉండా లని భవానీపురం పోలీసు సిబ్బందికి పోలీసు కమిషనర్‌ కాంతిరాణా సూచిం చారు. రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించి ఇటీవల ప్రారంభమైన భవానీపురం నూతన పోలీసు స్టేషన్‌ను శనివారం ఆయన సందర్శించారు. ఈ  సందర్భంగా సీఐ మురళీకృష్ణ  సీపీకి స్టేషన్‌ వివరాలు తెలియపరిచారు. అనంతరం పోలీసు కమిషనర్‌ మాట్లాడుతూ, ప్రజలకు, బాధితులకు రక్షణగా తామున్నామని పోలీసులు భరోసా ఇవ్వాలన్నారు. రానున్న భవానీదీక్షల విరమణ సందర్భంగా పోలీసు బందోబస్తు గురించి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెస్ట్‌జోన్‌ ఏసీపీ డాక్టర్‌ హనుమంతరావు, డీసీపీ బాబురావు పలు వివరాలను సీపీకి తెలియచేశారు.


Updated Date - 2021-12-19T06:11:33+05:30 IST