61 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-10-29T06:56:05+05:30 IST
జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 61 మందికి కరోనా సోకింది.
ఒకరు మృతి
విజయవాడ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 61 మందికి కరోనా సోకింది. మరో బాధితుడు గురువారం మరణించాడు. జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 1,19,215కు చేరుకున్నాయి. మరణాల సంఖ్య అధికారికంగా 1,427కు చేరింది. జిల్లావ్యాప్తంగా కరోనా బారినపడినవారిలో ఇప్పటి వరకు 1,16,986 మంది కోలుకున్నారు. 802 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.