ముగ్గురు మృతి.. 148 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-08-25T06:31:38+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చాపకింద నీరులా కొనసాగుతూనే ఉంది.

విజయవాడ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చాపకింద నీరులా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 148 మందికి వైరస్ సోకింది. మరో ముగ్గురు బాధితులు మంగళవారం మరణించారు. వీటితో కలిపి జిల్లాలో మరణాల సంఖ్య అధికారికంగా 1,287 కి చేరింది. మొత్తం పాజిటివ్ కేసులు 1,12,764కి చేరుకున్నాయి. జిల్లావ్యాప్తంగా వైరస్ బారినపడినవారిలో ఇప్పటి వరకు 1,09,329 మంది కోలుకున్నారు. ఇంకా 2,148 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.