47కేసులు.. ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2021-08-17T06:08:22+05:30 IST
జిల్లాలో కరోనా బారినపడి సోమవారం మరో ఇద్దరు బాధితులు మరణించారు.
విజయవాడ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా బారినపడి సోమవారం మరో ఇద్దరు బాధితులు మరణించారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 47 మంది వైరస్ బారినపడ్డారు. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 1,11,744కు చేరుకున్నాయి. మరణాల సంఖ్య అధికారికంగా 1,264కు చేరింది. జిల్లావ్యాప్తంగా కరోనా బారినపడినవారిలో ఇప్పటి వరకు 1,07,807 మంది కోలుకున్నారు. ఇంకా 2,673 మంది పాజిటివ్ బాధితులు కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.