కౌంటింగ్‌ సెంటర్‌ పరిశీలన

ABN , First Publish Date - 2021-03-14T05:53:11+05:30 IST

కౌంటింగ్‌ సెంటర్‌ పరిశీలన

కౌంటింగ్‌ సెంటర్‌ పరిశీలన
కౌంటింగ్‌ సెంటర్‌ను పరిశీలిస్తున్న విజయవాడ సిటీ డీసీపీ హర్షవర్ధనరాజు, ఏసీపీ విజయ్‌పాల్‌

ఉయ్యూరు, మార్చి 13 :: నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం, స్ట్రాంగ్‌ రూమ్‌ను  విజయవాడ సిటీ డీసీపీ హర్షవర్ధన్‌రాజు శనివారం పరిశీలించారు. తోటవ ల్లూరు రోడ్డులోని వీఆర్‌కేఎం పాఠశాల ఆవరణలో ఆడిటో రియంలో  ఓట్ల లెక్కింపు నిర్వహించనుండగా డీసీపీ పరిశీలించి పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. లె క్కింపు సందర్భంగా ఏవిధమైన అవాంచనీయ  సంఘట నలకు  తావులేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. ఓట్ల  లెక్కింపు సందర్భంగా తీసుకున్న చర్యలను ఈస్ట్‌జోన్‌ ఏసీపీ విజయ్‌పాల్‌, ఉయ్యూరు సీఐ నాగప్రసాద్‌  వివరించారు.  

ఫ నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు సందర్భంగా   ఆదివారం  భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సీఐ నాగప్రసాద్‌ తెలిపారు. ఏసీపీ విజయ్‌పాల్‌ ఆధ్వ ర్యంలో ముగ్గురు సీఐలు, 17 మంది ఎస్సైలు, 160మంది  సిబ్బంది  బందోబస్తు నిర్వహిస్తారని, పట్టణంలో 144వ సెక్షన్‌ అమలులో ఉంటుందని  తెలిపారు. 

Updated Date - 2021-03-14T05:53:11+05:30 IST