నేర ప్రవృత్తిని విడనాడండి

ABN , First Publish Date - 2021-07-12T05:58:13+05:30 IST

నేర ప్రవృత్తిని విడనాడండి

నేర ప్రవృత్తిని విడనాడండి
రౌడీ, సస్పెక్ట్‌ షీటర్లకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న సీఐ హనీష్‌బాబు

పాయకాపురం, జూలై 11: రౌడీ, సస్పెక్ట్‌ షీటర్లు నేర ప్రవృత్తిని విడనాడి, సత్ప్రవర్తనతో జీవించాలని కొవిడ్‌ మహమ్మారి వ్యాపిస్తున్నందున ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పక పాటించాలని నున్న సీఐ జేఆర్కే హనీ్‌షబాబు సూచించారు. నున్న పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రౌడీ, సస్పెక్ట్‌ షీటర్లకు ఆదివారం ఆయన కౌన్సెలింగ్‌ ఇచ్చారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంచి పౌరులుగా ఎదగాలని హితవు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు గోవింద్‌, శేషారెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-07-12T05:58:13+05:30 IST