తారకరామానగర్‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-07-24T06:25:51+05:30 IST

కృష్ణా నదికి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో తారకరామానగర్‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 17వ డివిజన్‌ కార్పొరేటర్‌ తంగిరాల రామిరెడ్డి స్థానికులకు సూచించారు.

తారకరామానగర్‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మాట్లాడుతున్న తంగిరాల రామిరెడ్డి

తారకరామానగర్‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కార్పొరేటర్‌ తంగిరాల రామిరెడ్డి

 రాణిగారితోట, జూలై 23: కృష్ణా నదికి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో తారకరామానగర్‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 17వ డివిజన్‌ కార్పొరేటర్‌ తంగిరాల రామిరెడ్డి స్థానికులకు సూచించారు. గత రెండు రోజుల నుంచి కృష్ణా నది ఎగువున భారీగా వర్షాలు పడడంతో నదిలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో అధికారులు బ్యారేజీ గేట్లు ఎత్తి వరద నీటిని కిందకు వదులుతున్నారు. కరకట్ట వెంబడి నదీ గర్భంలో నివసిస్తున్న ప్రజలను శుక్రవారం రామిరెడ్డి అప్రమత్తం చేశారు తారకరామానగర్‌లో పర్యటించిన ఆయన వరద ఉధృతిని పరిశీలించారు. వరద నీటితో ఇబ్బందులు ఏర్పడితే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, భారీగా వరద వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించి అన్నీ సదుపాయాలు కల్పిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2021-07-24T06:25:51+05:30 IST