కరోనా నియంత్రణకు ప్రత్యేక ప్రార్థనలు
ABN , First Publish Date - 2021-05-08T06:10:07+05:30 IST
కరోనా నియంత్రణకు ప్రత్యేక ప్రార్థనలు

రామలింగేశ్వరనగర్, మే 7 : రంజాన్ మాసం చివరి శుక్రవారం యునైటెడ్ ముస్లిం మైనార్టీ ఫోర్స్ ఆధ్వర్యంలో ఆటోనగర్ న్యూ పంటకాలువ రోడ్డులో సంస్థ ప్రధాన కార్యాలయంలో మత పెద్దలు జనాబ్ మౌలానా, మక్బూల్ అహ్మద్ నద్వీతో కలిసి సంస్థ రాష్ట్ర నాయకులు భక్తి శ్రద్ధలతో శుక్రవారం నమాజ్ చేసిన అనంతరం కరోనా మహమ్మారిని నివారించాలంటూ అల్లాహ్ను వేడుకుంటూ దువా (ప్రార్థ నలు) చేశారు. ఈ సందర్భంగా యూఎంఎంఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బెజవాడ నజీర్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నార ని, దీనిని నిలువరించి, వైరస్ సోకిన వారి ఆరోగ్యాలు కాపాడాలని, ప్రధాని నరేంద్ర మోదీ మనసులో నాటుకు పోయిన మతోన్మాద విషభీజాన్ని తొలగించి, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే సద్బుద్దిని ప్రసాదించమని, లాక్డౌన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆర్ధికపరంగా ఒడిదుడుకులు లేకుండా ఆయురారోగ్యాలతో కూడిన సుఖ జీవనాన్ని ప్రసాదించమని, రైతన్న సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు జనాబ్ మౌలానా మక్బూల్ అహ్మద్ నద్వీ, యూఎంఎంఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ సుబాని, షేక్ చాన్ బాషా, మొహమ్మద్ జబీవుల్లా, మొహమ్మద్ యాకూబ్, మస్తాన్ పాల్గొన్నారు.