విశాఖ ఉక్కుతో వ్యాపారమా?: నరహరిశెట్టి
ABN , First Publish Date - 2021-02-06T18:20:31+05:30 IST
భారత్ దేశాన్ని నరేంద్ర మోదీ సర్వ నాశనం చేస్తున్నారని విజయవాడ నగర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరహరశెట్టి నరసింహారావు విరుచుకుపడ్డారు.

విజయవాడ: భారత్ దేశాన్ని నరేంద్ర మోదీ సర్వ నాశనం చేస్తున్నారని విజయవాడ నగర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరహరశెట్టి నరసింహారావు విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కుతో వ్యాపారమా? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నపుడు పోరాడి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రారంభించారని తెలిపారు. బీజేపీ, వైసీపీలు కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మోసం చేయాలనుకోవడం అవివేకమన్నారు. బీజేపీ, వైసీపీ రాష్ట్ర ఎంపీలు ఈ విషయంపై పోరాడాలని... లేదంటే రాష్ట్రంలో వాళ్ళని తిరగనివ్వమని హెచ్చరించారు. బీజేపీ ఇచ్చిన బడ్జెట్ అదోగతిగా ఉందని, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ జోలికి వస్తే చూస్తూ కాంగ్రెస్ ఊరుకోదని నరహరిశెట్టి అన్నారు.