ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల కేసులు పరిష్కరించండి

ABN , First Publish Date - 2021-12-31T05:19:19+05:30 IST

ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల కేసులు పరిష్కరించండి

ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల కేసులు పరిష్కరించండి

అధికారులకు కలెక్టర్‌ నివాస్‌ ఆదేశాలు

పాయకాపురం, డిసెంబరు 30 : ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల కేసులను త్వరగా పరిష్కరించేందుకు న్యాయ, పోలీసు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ నివాస్‌ ఆదేశించారు. స్థానిక కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్‌తో పాటు ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ గురువారం సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా తాత్కాలిక న్యాయమూర్తులు, పబ్లిక్‌  ప్రాసిక్యూటర్లు మాట్లాడుతూ జనవరి 18 నుంచి 20వ తేదీ వరకూ ప్రత్యేకంగా పెండింగ్‌ కేసులపై విచారణ చేపడతామని కలెక్టర్‌కు హామీ ఇచ్చారు. ఇందుకోసం మచిలీపట్నం, విజయవాడల్లో ఉన్న స్పెషల్‌ సెషన్స్‌ కోర్టులకు రెగ్యులర్‌ న్యాయమూర్తులను నియమించాలని కోరుతూ కలెక్టర్‌ నివాస్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు లేఖ రాశారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ మాట్లాడుతూ అత్యాచారాల కేసుల్లో చార్జిషీటు దాఖలులో జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ కోర్టుల తాత్కాలిక న్యాయమూర్తులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, డీఎస్పీలు, సబ్‌ కలెక్టర్‌, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ కె.సరస్వతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T05:19:19+05:30 IST