రూ.81.24 కోట్లతో అభివృద్ధి పనులు

ABN , First Publish Date - 2021-01-20T06:47:22+05:30 IST

రూ.81.24 కోట్లతో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసి 25లోగా నివేదిక అందించాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ అధికారు లను ఆదేశించారు.

రూ.81.24 కోట్లతో అభివృద్ధి పనులు

25లోగా నివేదికలు అందించాలి : కలెక్టర్‌ 

విజయవాడ సిటీ : రూ.81.24 కోట్లతో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసి 25లోగా నివేదిక అందించాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ అధికారు లను ఆదేశించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ‘డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌’ 7వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన మంగళవారం జరి గింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో క్వారీలు, సిమెంట్‌ ఫ్యాక్ట రీలు, గనుల ప్రాంతాల్లో రవాణాకు సంబంధించి గనులు, భాగర్భగనులశాఖ నిబంధనల ప్రకారం జిల్లాలో 2016 నుంచి ఇప్పటివరకు రూ.127 కోట్లు డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ ఉందన్నారు. వీటితో క్వారీ నిర్వహణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక వసతులు చేపట్టాల్సి ఉందన్నారు. అందుకు రూ.81.24 కోట్లు మంజూరు చేశామన్నారు. రూ. 44.25 కోట్లతో 612 అభివృద్ధి పనులను జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, గన్నవరం నియోజకవర్గాలతో పాటు జిల్లా లోని ఇతర ప్రాంతాల్లో చేపట్టామన్నారు. ట్రస్ట్‌ నిర్వహణకు సంబంధించి రూ. లక్షా 97 వేల 500 మినరల్‌ ఫండ్‌ నుంచి ఖర్చు చేయాడానికి డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆమోదించింది. జేసీలు కె.మాధవీలత, మోహన్‌కుమా ర్‌, ట్రైనీ కలెక్టర్‌ భావనా వశిష్ట, గనులశాఖ ఇన్‌చార్జ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సుబ్ర హ్మణ్యం, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ ప్రకాష్‌నాయుడు, ఆర్‌డబ్ల్యుయస్‌ ఎస్‌ఈ సాయినాథ్‌ పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-20T06:47:22+05:30 IST