CM jagan సమక్షంలో పీసీవీ వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభం
ABN , First Publish Date - 2021-08-25T19:27:45+05:30 IST
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్

అమరావతి: ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ)డ్రైవ్‌ను వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సమక్షంలో నెలల చిన్నారికి వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది పీసీవీ వ్యాక్సిన్ వేసింది. పిల్లలలో న్యుమోనియా మరణాల నివారణకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటి వరకూ పిల్లలకు 9 రకాల వ్యాక్సిన్‌లు అందిస్తున్న ప్రభుత్వం, కొత్తగా ఇస్తున్న న్యుమోకోకల్‌తో కలిపి మొత్తంగా 10 రకాల వ్యాక్సిన్‌లు ఇవ్వనుంది.