కరోనా నియంత్రణపై సీఎం జగన్ సమీక్ష

ABN , First Publish Date - 2021-05-21T21:41:09+05:30 IST

కోవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.

కరోనా నియంత్రణపై సీఎం జగన్ సమీక్ష

అమరావతి: కోవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. 50 బెడ్స్.. అంతకన్నా ఎక్కువ ఉన్న ఆస్పత్రుల్లో కచ్చితంగా ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. 100 టన్నుల సామర్థ్యంతో ఆక్సీజన్‌ ప్లాంట్‌ పెడితే 20 శాతం ఇన్సెంటివ్‌ ఇవ్వాలని సీఎం తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లల చికిత్స కోసం ఐసీయూ బెడ్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఆ ఆస్పత్రుల్లో కూడా బెడ్‌ కెపాసిటీకి అనుగుణంగా ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. 300 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యంపైనా దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. గ్లోబల్‌ టెండర్ల ద్వారా వీలైనన్ని వ్యాక్సీన్లు సేకరించాలని తెలిపారు. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారందరికి కూడా భవిష్యత్తులో వ్యాక్సిన్లు ఇవ్వాలన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆక్సిజన్‌  సరఫరా పైపులు, మాస్క్‌లు అన్నింటిలోనూ ప్రమాణాలు పాటించాలని సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్ జగన్‌ నిర్దేశించారు.


Updated Date - 2021-05-21T21:41:09+05:30 IST