దుర్యోధనుడిలా వ్యవహరిస్తున్న సీఎం జగన్‌

ABN , First Publish Date - 2021-12-08T06:01:26+05:30 IST

కౌరవ సభలో దుర్యోధనుడు వెకిలి చేష్టలతో మహిళలను కించపరిచినట్లు ముఖ్యమంత్రి జగన్‌ మహిళలనూ కించపరుస్తూ దుర్యోధనుడిలా వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.

దుర్యోధనుడిలా వ్యవహరిస్తున్న సీఎం జగన్‌
మాట్లాడుతున్న వర్ల రామయ్య, పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, అనురాధ తదితరులు

దుర్యోధనుడిలా వ్యవహరిస్తున్న సీఎం జగన్‌

 టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య 

పటమట, డిసెంబరు 7: కౌరవ సభలో దుర్యోధనుడు వెకిలి చేష్టలతో మహిళలను కించపరిచినట్లు ముఖ్యమంత్రి జగన్‌ మహిళలనూ కించపరుస్తూ దుర్యోధనుడిలా వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. మంగళవారం అశోక్‌నగర్‌లోని శ్రీనివాస కల్యాణ మండపంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అధ్యక్షతన గౌరవ సభ జరిగింది. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ కౌరవ సభకు ఏమాత్రం తగ్గకుండా ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు కుమార్తెను దుర్భాషలాడుతూ శాసనసభను కౌరవ సభగా మార్చిన వైసీపీ ప్రభుత్వ పెద్దల పెత్తనం పతనమయ్యే సమయం దగ్గర్లోనే ఉందన్నారు. అందులో జగన్‌ దుర్యోధనుడి పాత్రను, వల్లభనేని వంశీ శకుని, అంబటి రాంబాబు దుశ్శాసనుడి పాత్రలను పోషించారన్నారు. శకునిలా కుయుక్తులు పన్నే వంశీ తొందరపాటుతో ఒక మాటను జారాను అంటూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ కొందరు వైసీపీ నాయకుల తీరుతో జిల్లాకు చెడ్డ పేరు వస్తుందన్నారు. జగన్‌ రాష్ట్ర సంపదను పెంచకపోయినా తన సొంత ఆదాయం మాత్రం నిండుగా పెంచుకున్నారన్నారు. మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ మాట్లాడుతూ అరాచకాలు, కూల్చివేతలతో జగన్‌ తెలుగువారి పరువు తీస్తున్నారన్నారు. ఆంధ్రులంతా కళ్లు  తెరిచి అరాచక పాలనకు చరమగీతం పాడాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శులు గన్నే వెంకట నారాయణ ప్రసాద్‌, ఎస్‌. ఫిరోజ్‌, చెన్నుపాటి గాంధీ, కార్పొరేటర్లు ముమ్మనేని ప్రసాద్‌, జాస్తి సాంబశివరావు, పొట్లూరి సాయిబాబు, చెన్నుపాటి ఉషారాణి, దేవినేని అపర్ణ, నాగేంద్ర రెడ్డి, రత్నం రమేష్‌, నందిపాటి దేవానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T06:01:26+05:30 IST