వైఎస్సార్ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా: సీఎం జగన్
ABN , First Publish Date - 2021-07-08T18:20:19+05:30 IST
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి 75వ జయంతి సందర్భంగా తనయుడు, ఏపీ సీఎం జగన్ ట్వీట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

అమరావతి: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి 72వ జయంతి సందర్భంగా తనయుడు, ఏపీ సీఎం జగన్ ట్వీట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పాలనలో తన తండ్రి అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నాను అంటూ ట్వీట్ చేశారు. ‘‘చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం. పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం. మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం. నీ ఆశయాలే నాకు వారసత్వం. ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా...పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా..జన్మదిన శుభాకాంక్షలు నాన్నా’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.