సీఎం కప్ పోటీలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-12-15T06:27:13+05:30 IST
సీఎం కప్ పోటీలు ప్రారంభం

కంకిపాడు, డిసెంబరు 14 : క్రీడల ద్వారా ఉల్లాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొం దించుకోవచ్చు అని కంకిపాడు ఎంపీపీ నెరుసు రాజ్యలక్ష్మి అన్నారు. పునాదిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన సీఎం కప్ పోటీలను జడ్పీటీసీ సభ్యు డు బాకి బాబుతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే మండలంలోని మొదటి ఫేజ్‌లో 28 పాఠశాలల అభివృద్ధి పరిచామని, విద్యతో పాటు క్రీడలపై విద్యార్థులు దృష్టి సారించాలని కోరారు. అనంతరం ప్రారంభ మైన క్రీడల్లో వైస్ ఎంపీపీ దూళిపూడి కిషోర్, ఏఎంసీ చైర్మన్ మద్దాలి రామచంద్రరావు విద్యార్థులతో ఆటలు ఆడి ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.