రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2021-12-31T05:20:29+05:30 IST

రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం కృషి

రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం కృషి

సివిల్‌ సప్లైస్‌ ఎండీ వీరపాండియన్‌

ఉయ్యూరు, డిసెంబరు 30 : ధాన్యం పండించే రైతులు.. కమీషన్‌ ఏజెంట్లు, మిల్లర్లు, దళారుల చేతిలో మోసపోకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని సివిల్‌ సప్లైస్‌ ఎండీ వీరపాండియన్‌ అన్నారు. జిల్లాలో మొదటిసారి పైలెట్‌ ప్రాజెక్టుగా ఎన్నికైన ఉయ్యూరు  మండ లం గండిగుంట, కడవకొల్లు రైతు భరోసా కేంద్రాల పరిఽధిలో ఏర్పాటుచేసిన ఇంటర్మీడియరీ గోదాము (మండి).. ప్రభుత్వమే ధాన్యం కొనే పద్ధతిని ఉయ్యూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో గురువారం కలెక్టర్‌ జె.నివాస్‌, జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలతతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సివిల్‌ సప్లైస్‌ ఉద్యోగులు, ధాన్యం కొనుగోలు కేంద్ర సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రైతులు మిల్లర్ల చుట్టూ తిరగకుండా, ఏవిధమైన ఇబ్బంది లేకుండా కనీస మద్దతు ధర వచ్చేలా చూడాలన్న ఉద్దేశంతో కొత్త విధానాలు అనుసరిస్తున్నామని, దీనికి సంబంధించి ఇంటర్మీడియరీ గోదాము పైలెట్‌ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని చెప్పారు. జిల్లాలో 234 కొనుగోలు కేంద్రాల ద్వారా 2లక్షల10వేల టన్నులు ధాన్యం కొన్నామన్నారు. 

Updated Date - 2021-12-31T05:20:29+05:30 IST