థియేటర్లపై అధికారుల తనిఖీలు

ABN , First Publish Date - 2021-12-25T06:40:20+05:30 IST

థియేటర్లపై అధికారుల తనిఖీలు

థియేటర్లపై అధికారుల తనిఖీలు
ప్రేక్షకుడితో మాట్లాడుతున్న జేసీ మాధవీలత

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నగరంలోని సినిమా థియేటర్లపై అధికారుల ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ధరకే సినిమా టికెట్లను విక్రయిస్తున్నారా? లేదా? అన్నది తెలుసుకోవటానికి శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవీలత ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. అన్నపూర్ణ, శకుంతల, అప్సర థియేటర్లను పరిశీలించారు. సినిమా ప్రదర్శన సమయంలో థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులతో జేసీ మాట్లాడారు. ఆన్‌లైన్‌లో ఎంత ధర చెల్లించారు? ఆఫ్‌లైన్‌లో ఎంతకు కొనుగోలు చేశారు? వంటి వివరాలను  అడిగారు. ఆయా థియేటర్లలో ఎంతమంది ప్రేక్షకులు ఉన్నారో చూశారు. థియేటర్‌లో ఉన్న ప్రేక్షకుల సంఖ్య, ఆన్‌లైన్‌లో టికెట్‌ పొందిన వారి సంఖ్య, ఆఫ్‌లైన్‌లో టికెట్లు కొన్నవారి సంఖ్యతో సరి పోల్చి చూశారు. సినిమా హాళ్ల క్యాంటీన్లలో ధరల పట్టికలను పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని ఆదేశించారు. టాయిలెట్లను కూడా జేసీ పరిశీలించారు. మాస్కుతో రావాలని ప్రేక్షకులకు సూచించారు. 

Updated Date - 2021-12-25T06:40:20+05:30 IST