చైల్డ్ ఫ్రెండ్లీ కొవిడ్ కేర్ సెంటర్ పరిశీలన
ABN , First Publish Date - 2021-10-29T06:24:52+05:30 IST
థర్డ్ వేవ్‌ను దృష్టిలో పెట్టు కుని నగరంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన చైల్డ్ ఫ్రెండ్లీ కొవిడ్ కేర్ సెంటర్‌ను గురువారం చైల్డ్ ఫండ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ అరుణ, ప్రాజెక్ట్ హోప్ డైరెక్టర్ రే లు పరిశీలించారు.

చైల్డ్ ఫ్రెండ్లీ కొవిడ్ కేర్ సెంటర్ పరిశీలన
పాయకాపురం, అక్టోబరు 28 : థర్డ్ వేవ్‌ను దృష్టిలో పెట్టు కుని నగరంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన చైల్డ్ ఫ్రెండ్లీ కొవిడ్ కేర్ సెంటర్‌ను గురువారం చైల్డ్ ఫండ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ అరుణ, ప్రాజెక్ట్ హోప్ డైరెక్టర్ రే లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, వైద్య సిబ్బంది అందించే సేవలు, తదితర వివరాలు తెలుసుకున్నారు. అలాగే కరోనా థర్డ్ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులకు, వైద్యులకు పలు సూచనలు చేశారు. అనంతరం చైల్డ్ ఫండ్ ఇండియా, ప్రాజెక్ట్ హోప్ సంయుక్తంగా రూ. 40 లక్షలు విలువ చేసే మెడికల్ ఎక్విప్‌మెంట్, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్, మానిటర్స్, పల్స్ ఆక్సీమీటర్లు, పీపీఈ కిట్లు, మాస్కులు, చిన్న పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ టాయిస్ తదితర సామాగ్రి అందజేశారు.