హక్కులు తెలియకే మోసాలు

ABN , First Publish Date - 2021-12-26T06:25:09+05:30 IST

వినియోగదారుల్లో చాలామందికి తమ హక్కుల గురించి తెలియదని అం దుకే అనేకచోట్ల మోసపోతుంటారని సుప్రీంకోర్టు ప్ర ధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ అన్నారు.

హక్కులు తెలియకే మోసాలు

‘ఆసరా’ కృషి అభినందనీయం 

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ 

లబ్బీపేట, డిసెంబరు 25 : వినియోగదారుల్లో చాలామందికి తమ హక్కుల గురించి తెలియదని అం దుకే అనేకచోట్ల మోసపోతుంటారని సుప్రీంకోర్టు ప్ర ధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొ న్న ఆయన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఆసరా రూపొందించిన పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల పరిరక్షణలో ఆసరా (అడ్వకేట్‌ అసోసియేషన్‌ ఫర్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ అవేర్‌నెస్‌) కృషి అభినందనీయమని, ఆస రా సంస్థ వినియోగదారుల హక్కుల గురించి తెలియజేయడంతో పాటు వినియోగదారులను చైతన్యం పరచటంలో మంచి కృషిచేస్తుందన్నారు. ఆసరా జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ తరుణ్‌ కాకాని మాట్లాడుతూ ఈ ఏడాది వినియోగదారులకు హక్కుల పట్ల చైతన్యం కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా కళాశాలలు, విద్యాసంస్థల్లో విద్యార్థులకు, యువతకు తెలియజేసేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు. అలాగే షాపింగ్‌ మాల్స్‌, వ్యాపార సంస్థల కూడళ్ల వద్ద పెద్దస్థాయిలో వినియోగదారులు మోసపోతుంటారని వాటి గురించి తెలియజేసే మీ తరపున ఆసరా సంస్థ పోరాడటంతోపాటు తగిన నష్ట పరిహారం కూడా అందించేలా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసరా కృష్ణా సభ్యులు పాల్గొన్నారు.

మానవహక్కుల రక్షణ పోస్టర్‌ ఆవిష్కరణ

విజయవాడ లీగల్‌ : మానవహక్కుల రక్షణ పోస్టరును సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణతో బెజవాడ బార్‌ న్యాయవాదులు ఆవిష్కరింపచేశారు. శనివారం నోవాటెల్‌ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో న్యాయవా ది, టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ నెల్లిబండ్ల బాలస్వామి, న్యాయవాదులు కోగంటి రామారావు, బీవీ రంగారావు, పి.కిరణ్‌, ఉడా మాజీ ఛైర్మన్‌ తూమాటి ప్రేమ్‌నాథ్‌, సామాజిక కార్యకర్త ప్రసన్న తదితరులు వెంకట రమణ చేతుల మీదుగా పోస్టరును ఆవిష్కరింప చేశారు. 

బీసీ గణన చేపట్టాలని రమణకు వినతి

పాయకాపురం : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూ ర్తి ఎన్వీ రమణను ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జనగణనలో బీసీ గణ న చేపట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సం ఘం నేతలు కుమ్మర క్రాంతి కుమార్‌, తన్నీరు ఆంజనేయులు, గోనుగుంట్ల బ్రహ్మానంద శర్మ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-26T06:25:09+05:30 IST