చట్టాలపై అవగాహన ఉండాలి

ABN , First Publish Date - 2021-10-25T06:00:29+05:30 IST

చట్టాలపై అవగాహన ఉండాలి

చట్టాలపై అవగాహన ఉండాలి
సదస్సులో మాట్లాడుతున్న న్యాయమూర్తి గంగాభవాని

అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి వి.గంగాభవాని

గన్నవరం, అక్టోబరు 24 : చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని అందుకోసమే న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి వి.గంగాభవాని అన్నారు. బుద్ధవరం పంచాయతీ కార్యాలయంలో ఆదివారం న్యాయవిజ్ఞాన సదస్సు బార్‌ అసోసి యేషన్‌ అధ్యక్షుడు  వెంకట్రావు అధ్యక్షతన జరి గింది. ఈ సందర్భంగా జడ్జి గంగాభవాని మాటా ్లడుతూ  చట్టం ముందు అందరూ సమానులేనన్నా రు. అందరు సోదరభావంతో కలిసి మెలిసి ఉండా లని చెప్పారు. తగాదాలు పడి పోలీస్‌ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగవద్దని,   సమస్యలను సామర స్యంగా పరిష్కరించుకోవాలన్నారు. సర్పంచ్‌ బడు గు బాలమ్మ జడ్జి గంగా భవానిని దుశ్శాలువాలతో సత్కరించారు. న్యాయవ్యాదులు అనుమోలు వెంకటేశ్వరరావు, దాసరి భాగ్యలక్ష్మి, ఎస్సై రమే్‌షబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-25T06:00:29+05:30 IST