గవన్నవరం ఎయిర్‌పోర్టులో కేంద్రమంత్రి జయశంకర్‌కు ఘనస్వాగతం
ABN , First Publish Date - 2021-02-06T15:48:17+05:30 IST
జిల్లాకు చేరుకున్న కేంద్ర మంత్రి ఎస్.జయశంకర్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు గన్నవరం విమానాశ్రయంలో సాదరంగా స్వాగతం పలికారు.

విజయవాడ: జిల్లాకు చేరుకున్న కేంద్ర మంత్రి ఎస్.జయశంకర్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు గన్నవరం విమానాశ్రయంలో సాదరంగా స్వాగతం పలికారు. ఉదయం 11గంటలకు మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడనున్నారు. సాయంత్రం వెన్యూ ఫంక్షన్ హాలులో బడ్జెట్‌పై జయశంకర్ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రతినిధులు, మేధావులు, బిజెపి రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారు.