భవనంపై నుంచి పడి కార్పెంటర్‌ మృతి

ABN , First Publish Date - 2021-12-26T06:40:12+05:30 IST

భవనంపై నుంచి పడి కార్పెంటర్‌ మృతి

భవనంపై నుంచి పడి కార్పెంటర్‌ మృతి

పాయకాపురం, డిసెంబరు 25: నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడిన కార్పెంటర్‌ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. ఈ ఘటన పాయకాపురం ప్రాంతంలో శనివారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. రాజీవ్‌నగర్‌కు చెందిన మెంటి ధర్మారావు(26) వడ్రంగి పని చేస్తుంటాడు. అదే ప్రాంతంలో మూడు అంతస్తుల భవనం పనులు చేసేందుకు ఒప్పందం కుదర్చుకున్నాడు. ఉదయం చేయాల్సిన పనులను పరిశీలించేందుకు శుక్రవారం అర్ధరాత్రి స్నేహితులతో కలసి భవనం వద్దకు వెళ్లాడు. పనులను పరిశీలించి వస్తాను.. మీరు వెళ్లండి అని వారిని పంపించి వేశాడు. స్నేహితులు కొద్ది దూరం వెళ్లగానే పెద్ద కేక వినబడటంతో వెనక్కి వెళ్లి చూశారు. భవనంపై నుంచి ధర్మారావు పడిపోయి ఉన్నాడు. దీంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-12-26T06:40:12+05:30 IST