పాలేటిలో వడ్రంగి మృతదేహం

ABN , First Publish Date - 2021-05-05T05:50:22+05:30 IST

పాలేటిలో వడ్రంగి మృతదేహం

పాలేటిలో వడ్రంగి మృతదేహం

జగ్గయ్యపేట, మే 4: కే అగ్రహరం గ్రామం వద్ద పాలేటిలో జగ్గయ్యపేటకు చెందిన వడ్రంగి దేవరపల్లి నరసింహాచారి(45) మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం బంధువులు గుర్తించారు. కొద్ది రోజులగా తన బావ కనిపించడం లేదని పట్టణానికి చెందిన ఆదినారాయణ సోమవారం ఫిర్యాదు చేశారు. జగ్గయ్యపేట పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. పాలేటిలో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు పడి పోయాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు.


Updated Date - 2021-05-05T05:50:22+05:30 IST