కారు అదుపు తప్పి దూసుకెళ్లి ఒకరి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2021-12-31T06:03:26+05:30 IST

కారు అదుపు తప్పి దూసుకెళ్లి ఒకరి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు

కారు అదుపు తప్పి దూసుకెళ్లి ఒకరి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు

గన్నవరం, డిసెంబరు 30: జాతీయ రహదారి పక్కన నిలబడిన ఇద్దరిపై కారు దూసుకుపోయిన సంఘటన మండలంలోని కేసరపల్లి శివారు దుర్గాపురంలో గురువారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం.. విమానాశ్రయం నుంచి పశ్చిమ గోదావరి పెనుకొండ వెళుతున్న కారు దుర్గాపురం వద్దకు రాగానే అదుపుతప్పింది. జాతీయ రహదారి పక్కన ఉన్న హోటల్‌ వద్ద నిలబడిన స్థానికులు గాలి జయరాజు(45), ఎస్కే సాధిక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జయరాజు అక్కడికక్కడే మృతి చెందగా.. సాధిక్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై రమేష్‌బాబు బృందం ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన సాధిక్‌ను 108లో చిన్నఆవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రికి తరలించారు. అతి వేగంగా కారు నడపటం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2021-12-31T06:03:26+05:30 IST