గుంటూరు జిల్లా ఎడ్ల హవా

ABN , First Publish Date - 2021-01-13T06:39:57+05:30 IST

మూడో రోజు పోటీలను ప్రారంభిస్తున్న మంత్రి కొడాలి నాని

గుంటూరు జిల్లా ఎడ్ల హవా
ఆరు పళ్ల విభాగం ప్రథమ స్థానం పొందిన చంటి గణేష్‌రెడ్డి, ఉప్పల లక్ష్మయ్యలకు బహుమతి ప్రదానం చేస్తున్న మంత్రి కొడాలి నాని

గుడివాడరూరల్‌, జనవరి 12 :  నాలుగు పళ్ల విభాగంలో గుంటూరు జిల్లాకు చెందిన గుంజి రిషిత, ఎన్‌.గీతాచౌదరి ఎడ్ల జత నిర్ణీత సమయంలో 4617 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. పత్తిపాడుకు చెందిన  అంజయ్య చౌదరి ఎడ్ల జత 4500 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. కొల్లిపరకు చెందిన నాగప్రకా్‌షరెడ్డి ఎడ్ల జత 4350 అడుగుల దూరం లాగి మూడవ బహుమతి సాధించాయి. ఆరుపళ్ల విభాగంలో గుంటూరు జిల్లా గోగుల మూడి పాడుకు చెందిన చంటి గణే్‌షరెడ్డి, గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన ఉప్పల లక్ష్మయ్య ఎడ్ల జత 4500 అడుగుల దూరం బండలాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. కానూరుకు చెందిన డీవీఆర్‌ స్మారక దేవభక్తుని సుబ్బారావు ఎడ్ల జత 4140 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం సాధించాయి. వేటపాలేనికి చెందిన  శిరీషచౌదరి, శివకృష్ణ ఎడ్ల జత 4131 అడుగుల మేర బండ లాగి తృతీయస్థానం కైవసం చేసుకున్నాయి. ఈ పోటీలను వైసీపీ రాష్ట్ర నాయకుడు దుక్కిపాటి శశి భూషణ్‌, రైతు నాయకుడు వల్లభనేని భానుప్రకాష్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ అడపా బాబ్జీ, గొర్ల శ్రీను, గుడివాడ రూరల్‌ మండల పార్టీ అధ్యక్షుడు  జాన్‌విక్టర్‌, ఎన్టీఆర్‌ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, ఏరియా ఆసుపత్రి చైర్మన్‌ ఎంవీ నారాయణరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. విజేతలకు మంత్రి కొడాలి నాని బహుమతి ప్రదానం చేశారు. 

మంత్రి కొడాలి నాని సంక్రాంతి శుభాకాంక్షలు

గుడివాడ, జనవరి 12: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మంత్రి కొడాలి నాని సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండుగ తెలుగు లోగిళ్లలో వెలుగులు నింపాలని ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. సంక్రాంతిని రైతుల పండుగగా అభివర్ణించారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి గ్రామాల అభివృద్ధికి సీఎం జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.  



Updated Date - 2021-01-13T06:39:57+05:30 IST