స్వరాజ్య మైదానంలోనే పుస్తక మహోత్సవం

ABN , First Publish Date - 2021-12-25T07:09:26+05:30 IST

విజయవాడ 32వ పుస్తక మహోత్సవం జనవరి 1న స్వరాజ్య మైదానంలో ప్రారంభమవుతుందని విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ కార్యదర్శి కె.లక్ష్మయ్య ఓ ప్రకటనలో తెలిపారు.

స్వరాజ్య మైదానంలోనే పుస్తక మహోత్సవం

జనవరి 1 నుంచి ప్రారంభం


విజయవాడ, డిసెంబరు 24 : విజయవాడ 32వ పుస్తక మహోత్సవం జనవరి 1న స్వరాజ్య మైదానంలో ప్రారంభమవుతుందని విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ కార్యదర్శి కె.లక్ష్మయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఇంతకు ముందు పుస్తక మహోత్సవ వేదికగా శాతవాహన కాలేజీ మైదానాన్ని ప్రకటించామని, అయితే ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో స్వరాజ్య మైదానంలోనే పుస్తక మహోత్సవాన్ని నిర్వహించనున్నామని పేర్కొన్నారు. జనవరి 1న గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభిస్తారని లక్ష్మయ్య తెలిపారు.  

Updated Date - 2021-12-25T07:09:26+05:30 IST