ఆ స్ఫూర్తితోనే జగన్‌పై అమరావతి మహిళల పోరాటం: Lanak dinakar

ABN , First Publish Date - 2021-11-02T16:03:10+05:30 IST

సీఎం జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ నేత లంకా దినకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆ స్ఫూర్తితోనే జగన్‌పై అమరావతి మహిళల పోరాటం: Lanak dinakar

అమరావతి: సీఎం జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ నేత లంకా దినకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నరకాసురునిపై సత్యభామ విజయం ప్రతీక దీపావళి సంబరాలు అని... ఈ స్ఫూర్తితో జగన్‌పై అమరావతి మహిళలు పోరాటం చేస్తున్నారని అన్నారు. నాడు పల్నాటి బ్రహ్మానాయుడుకి అండగా కన్నమదాసు లాగా నేడు అమరావతి ఉద్యమం కోసం దళిత బహుజన జేఏసీ పనిచేస్తుందని చెప్పారు. జగన్ మెడ మీద తల లేని పాలనతో ఆంధ్రప్రదేశ్ తల లాంటి రాజధాని ఏదో దేశంలో అర్థం కాకుండా చేశారని విమర్శించారు. రాజధానికి భూములిచ్చిన రైతులను రోడ్ మీదకు తెచ్చిన జగన్ పాలన రాష్ట్ర పరువు బజారుకి ఈడ్చేసిందన్నారు. అమరావతి రైతుల పాదయాత్రతో జగన్‌కు కనువిప్పు కలగాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్ధిస్తూన్నానని లంకా దినకర్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-02T16:03:10+05:30 IST