భక్తిశ్రద్ధలతో నాగులచవితి పూజలు

ABN , First Publish Date - 2021-11-09T06:22:37+05:30 IST

భక్తిశ్రద్ధలతో నాగులచవితి పూజలు

భక్తిశ్రద్ధలతో నాగులచవితి పూజలు
ఉయ్యూరు శివాలయం వద్ద పుట్టలో పాలుపోస్తున్న భక్తులు

పెనమలూరు, నవంబరు 8 : నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం వేకువ జాము నుంచే పలు ఆలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు  నిర్వహించారు.  కార్తీక సోమవారం, నాగుల చవితి  రెండు పర్వదినాలు ఒకే రోజున  కలిసి రావ డంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. చోడవరం నాగేంద్రస్వామి ఆలయానికి భక్తులు పోటె త్తారు.  భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు క్యూలైన్‌ ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో క్యూలైన్‌లో గంట ల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. భక్తులు భక్తి శ్రద్ధల తో నాగేంరద్రస్వామికి నైవేధ్యాలు సమర్పించి మొక్క బడులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సీఐ సత్య నారాయణ తన సిబ్బందితో ఏర్పాట్లను పరిశీలించారు. 

ఫ యనమలకుదురు రామలింగేశ్వరస్వామి కొండపై న  ఉన్న నాగ్రేంద్ర స్వామి పుట్టలో భక్తు లు నైవేధ్యాలు సమ ర్పించి మొక్కు బడు లు చెల్లించు కున్నా రు. అనంతరం ఆల యం వెలుపల కను ల పండువగా కార్తీక దీపారాధన జరిపారు. కార్యక్రమాలను ఆల య ఈవో బి. గంగా ధరరావు పర్య వేక్షించారు. 

ఉయ్యూరులో..

ఉయ్యూరు  : కార్తీక సోమవారం, నాగుల చవితి కలసి రావడంతో ఉయ్యూరు పట్టణ, మండల పరిధి గ్రామాల్లో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జామునుంచి భక్తులు ఆలయాలకు తరలివచ్చి  నాగేంద్రస్వామి పుట్టలో పాలుపోసి పూజలు చేశారు. కార్తీక సోమవారం కావడంతో ఆలయాల ప్రాంగణాల్లో దీపారాధన, పూజలు చేశారు. పట్టణంలోని జగదంబా సమేత సోమేశ్వరస్వామి ఆలయంలో ఉయ్యూరు కమిషనర్‌ సత్యనారాయణ పూజలు చేశారు. 

కంకిపాడులో..

ఫ కంకిపాడు  : మండలంలోని వివిధ గ్రామాల్లో నాగుల చవితి వేడకలను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అదే విధంగా కార్తీక మొదటి సోమ వారం కూడా కావడంతో భక్తులు దేవాలయాలకు క్యూ కట్టారు. భక్తులతో శివాలయాలు ఉదయం 4 గంటల నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

బాపులపాడు మండలంలో..

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌  : బాపులపాడు మండ లంలో సోమవారం నాగుల చవితి వేడుకలు వైభ వంగా జరిగాయి. కార్తీకమాస సోమవారం, నాగుల చవితి  రెండు పర్వదినాలు ఒకే రోజున  కలిసి రావ డంతో మండల వ్యాప్తంగా గల శివాలయాలు భక్తుల తో కిటకిటలాడాయి.పెరికీడు ముక్తేశ్వరాలయంలో వేకువజామునుంచే భక్తులు బారులు తీరారు. కృష్ణా మిల్క్‌ యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు స్వామి వారిని దర్శించుకుని పూజలో పాల్గొన్నారు. అర్చకులు శ్యామ్‌ ఆధ్వర్యంలో   భక్తులు  మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు నండూరి శర్మ, రంగారావు, తవ్యా మూర్తి, నక్కా బాబు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆరుగొలను సుబ్రమణ్వేశ్వరస్వామి ఆలయం వద్ద పుట్ట  భక్తులు పూజలు చేశారు.  దీపా లు వెలగించి మొక్కులు తీర్చుకున్నారు. వీరవల్లి కొండేశ్వరస్వామి ఆలయంలో కుందుర్తి మురళి ఆధ్వ ర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తపల్లి, సిరివాడ, కానుమోలు, మల్లవల్లిలో శివాల యాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి. 

విజయవాడ రూరల్‌లో..

విజయవాడ రూరల్‌  : విజయవాడ రూరల్‌ మండలంలో నాగుల చవితి పర్వదినాన్ని భక్తులు సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో భక్తులు వేకువజామునుంచే శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే తోటలు, ఆలయాల్లోని పుట్టల వద్ద పాలు పోసి, నాగ దేవతకు పూజలు చేశారు. మండలంలో నున్న చిన కంచి, నరసింహస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మండలంలోని పాతపాడు, పీ నైనవరం, అంబాపురం, కొత్తూరు తాడేపల్లి, జక్కంపూడిలోనూ నాగుల చవితి వేడుకలు నిర్వహించారు.

గన్నవరంలో..

గన్నవరం : మండలంలో నాగులచవితిని భక్తిశ్రద్ధలతో సోమవారం జరుపుకున్నారు. కేసరపల్లి శివారు గుమ్మడి నాగేంద్ర క్షేత్రం భక్తులతో కిటకిట లాడింది. తెల్లవారు జామునుంచే పుట్టల్లో పాలు పోసేందుకు భక్తులు బారులు తీరారు. పుట్ట వద్ద పాలు పోసి దీపాలు వెలిగించి భక్తిని చాటారు. ఆల య నిర్వాహకులు రావులపల్లి వరలక్ష్మి, రాఘవరావు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గన్నవరం, గొల్లనపల్లి, వీరపనేనిగూడెం, ముస్తాబాద, చిక్కవ రం శివాలయాల్లో భక్తుల సందడి కనిపించింది.

Updated Date - 2021-11-09T06:22:37+05:30 IST