భగత్‌సింగ్‌ స్ఫూర్తితో ఉద్యమించాలి

ABN , First Publish Date - 2021-03-24T06:18:14+05:30 IST

భగత్‌సింగ్‌ స్ఫూర్తితో ఉద్యమించాలి

భగత్‌సింగ్‌ స్ఫూర్తితో ఉద్యమించాలి
ఉయ్యూరులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన

 కృష్ణలంక, మార్చి 23 : యువత భగత్‌సింగ్‌ స్ఫూర్తితో సమాజంలోని అసమానతలపై ఉద్యమిం చాలని పలువురు నాయకులు అన్నారు.  భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌  వర్ధంతిని  నిర్వహించారు. భ్రమరాంబపురంలోని గంగానమ్మ గుడి వద్ద, రాణిగారితోటలోని సుందరయ్య గ్రంథాలయం వద్ద డీవైఎఫ్‌ఐ-సీఐటీయూ నాయకులు సంయుక్తంగా భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ పశ్చిమ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్రం, స్వేచ్ఛ సమానతల కోసం భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ వంటి పోరాటయోధులు ప్రాణాలర్పించారన్నారు.   కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బత్తుల చిన్నారావు, ఎన్‌.హరినారాయణ, కాయల లక్ష్మణ, చంద్రశేఖర్‌, డీవైఎఫ్‌ఐ నాయకులు తాండవ కృష్ణ, రోహిత్‌ కృష్ణ, వై.కృష్ణ, రవితేజ, అప్పారావు పాల్గొన్నారు. 

 ఉయ్యూరులో కాగడాల ప్రదర్శన 

ఉయ్యూరు : సమాజంలో సమస్యల పరిష్కారానికి యువత భగత్‌సింగ్‌ పోరాటస్ఫూర్తితో ఉద్యమిం చాలని సీపీఎం ఉయ్యూరు మండల కార్యదర్శి కోసూరి శివనాగేంద్రం అన్నారు. భగత్‌సింగ్‌ వర్ధంతి పురస్కరించుకుని స్థానిక కాకాని గిరిజన కాలనీలో మంగళవారం కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమసమాజ స్థాపనే ధ్యేయంగా సోషలిజాన్ని కాంక్షించిన భగత్‌ సింగ్‌ ఆశయాల కోసం యువత పాటు పడాలన్నారు.  ప్రైవేటీకరణ వల్ల  భవిష్యత్తులో  రిజర్వేషన్లు లేకుం డా  పోతాయన్నారు. ప్రజాసంఘాల నాయకులు గోపయ్య,  వెంకయ్య,  వీరయ్య, నిమ్మాది కొండలు ఇస్మాయిల్‌, బాజీ తదిరులు పాల్గొన్నారు. 

విజయవాడ రూరల్‌లో

విజయవాడ రూరల్‌ : మండంలోని పలు గ్రామాలలో స్వాతంత్ర సమరయోధులు, భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ వర్ధంతి కార్యక్రమాలు మంగళ వారం నిర్వహించారు. నున్న  పీఏసీఎస్‌ ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భగత్‌సింగ్‌ చిత్రప టానికి వామపక్ష, ఉద్యోగ సంఘాల నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మేనేజర్‌ సురేష్‌, సీపీఎం మండల కార్యదర్శి మాతంగి ఆంజనేయులు,  గుంటక చిన వెంకటరెడ్డి, డాక్టర్‌ బీ శివరామ్‌, జీవీ రంగారెడ్డి, సీపీఐ నాయకుడు ఆరేపల్లి రామకోటేశ్వరరావు పాల్గొన్నారు. రామవరప్పాడులో సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన భగత్‌సింగ్‌ వర్ధంతి కార్యక్రమంలో మండల కార్యదర్శి పీ వెంకటేశ్వరరావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

 హనుమాన్‌ జంక్షన్‌లో..

హనుమాన్‌ జంక్షన్‌ :  బాపులపాడు మండల  సీపీ ఎం ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌వర్ధంతి కార్యక్రమాన్ని  మంగళవారం హనుమాన్‌జంక్షన్‌ నాలుగు రోడ్ల సెంట ర్‌లో నిర్వహించారు.  సీపీఎం మండల కార్యదర్శి బేత శ్రీనివాసరావు  భగత్‌సింగ్‌  చిత్రపటానికి పూల మాల వేసి  నివాళులర్పించారు.  భగత్‌సింగ్‌తో పాటు  రాజ్‌గురు, సుఖదేవ్‌ల  త్యాగాలను  గుర్తుచేశారు.  కార్యక్రమంలో అబ్దుల్‌ బారీ. నల్లి ఆంజనేయులు,  కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.

యువతకు భగత్‌సింగ్‌ ఆదర్శం

గన్నవరం : బ్రిటీష్‌ సామ్రాజ్య వాదులను తరిమి కొట్టడానికి సాయుధ పోరాటం చేసిన భగత్‌సింగ్‌ నేటితరం యువతకు ఆదర్శనీయమని సీపీఐ ఏరియా కార్యదర్శి పెద్దు వాసుదేవరావు అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ల  వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చిన్న వయస్సులోనే దేశం కోసం ప్రాణా లర్పించిన యువ నేతలని చెప్పారు.   ఆ ముగ్గురు స్పూర్తితో దేశంలో బీజేపీ ప్రభుత్వం ఆవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ప్రైవేటీకరణపై యువత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. నాయకులు బండారు లక్ష్మయ్య, పడమట నరేష్‌, తెలుగు యువత జిల్లా నాయకులు బొడ్డపాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 

ఉంగుటూరులో..

ఉంగుటూరు :  ఉంగుటూరు ప్రజా సంఘాల కార్యాలయంలో మంగళవారం అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో  భగత్‌సింగ్‌  వర్ధంతి   నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్యోద్యమంలో విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్నిచ్చిన విప్లవకారుడు భగత్‌సింగ్‌ అని కొనియాడారు. సీపీఎం నాయకులు టీ.వీ.లక్ష్మణస్వామి, అజ్మీర్‌ వెంకటేశ్వరరావు, శనగల లక్ష్మా రెడ్డి, సంతోష్‌, కె. సీతారామరాజు, టీడీపీ నేత ఆరుమళ్ల కృష్ణారెడ్డి, వైసీపీ నేత తులసి, ఉంగుటూరు సర్పంచ్‌ కాటూరి వరప్రసాద్‌  పాల్గొన్నారు. 

పటమటలంక లైబ్రరీ సెంటర్‌ వద్ద..

రామలింగేశ్వరనగర్‌  : బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి విప్లవవీరుడు సర్దార్‌ భగత్‌సింగ్‌ ఆశయస్ఫూర్తితో ముందుకు సాగాలని సీపీఐ నగర కార్యదర్శి లంక దుర్గారావు అన్నారు. భగత్‌సింగ్‌  వర్ధంతిని సీపీఐ, యువజన సమాఖ్య ఆధ్వర్యంలో స్ధానిక పటమటలంక లైబ్రరీ సెంటర్‌ వద్ద నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ శాఖ కార్యదర్శి దోనేపూడి సూరిబాబు, యువజన నాయకులు మోతుకూరి అరుణ్‌ కుమార్‌, లంక ప్రసాద్‌, అన్నే జగన్నాధం పాల్గొన్నారు.

Updated Date - 2021-03-24T06:18:14+05:30 IST