13న ఏపీటీఎఫ్‌ ధర్నా

ABN , First Publish Date - 2021-08-10T06:23:25+05:30 IST

ప్రాథమిక పాఠశాలల్ని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం, సమాంతర మాధ్యమాలు రద్దు చేసి

13న ఏపీటీఎఫ్‌ ధర్నా

గవర్నర్‌పేట, ఆగస్టు 9: ప్రాథమిక పాఠశాలల్ని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం, సమాంతర మాధ్యమాలు రద్దు చేసి ఒకే మాధ్యమం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదించడాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 13న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. భానుమూర్తి, పి. పాండురంగ వరప్రసాదరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని వర్గాలతో చర్చించిన తరువాతే విద్యా సంస్కరణలు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం 80శాతం మంది వ్యతిరేకించిన సంస్కరణల అమలుకు ముందుకు వెళ్లడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వం తలపెట్టిన విద్యా సంస్కరణల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించడం, ఉన్నత పాఠశాలల్లో ప్లస్‌ టూ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగే ధర్నాలో ఉపాధ్యాయులు పెద్దఎత్తున పాల్గొని ప్రభుత్వ ప్రతిపాదనలు వ్యతిరేకించాలని కోరారు.

Updated Date - 2021-08-10T06:23:25+05:30 IST