ఏపీఎండీసీ అభివృద్ధికి పాటుపడతా..
ABN , First Publish Date - 2021-08-03T06:00:31+05:30 IST
ఏపీఎండీసీ అభివృద్ధికి పాటుపడతా..

చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన షమీమ్ అస్లాం
విజయవాడ సిటీ, ఆగస్టు 2 : సీఎం జగన్ తనపై ఉంచిన బాధ్యతను నిలబెట్టుకోవడంతో పాటు ఆంధ్రపదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ)ను ప్రగతిపథంలో నడిపించేందుకు కృషి చేస్తానని సంస్థ చైర్పర్సన్ షమీమ్ అస్లాం తెలిపారు. నగరంలోని కార్యాలయంలో సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సాధికారితకు చేస్తున్న కృషి, మహిళలను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములను చేసేందుకు తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా తనకు ఈ బాధ్యతలను అప్పగించారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి సహకారంతో రానున్న రోజుల్లో ఏపీఎండీసీని మరింత ముందుకు తీసుకెళ్తానన్నారు. అనంతరం కార్యాలయ అధికారులతో భేటీ అయ్యారు. సంస్ధ జేడీ డి.శ్రీనివాసరావు, కార్యదర్శి ఆర్.మణికిరణ్, అధికారులు పాల్గొన్నారు.