సమస్యల పరిష్కారానికి కార్యవర్గాల ఏర్పాటు
ABN , First Publish Date - 2021-11-28T05:57:04+05:30 IST
సమస్యల పరిష్కారానికి కార్యవర్గాల ఏర్పాటు

ఏపీ వీఆర్వో సంఘం నేతలు
విజయవాడ సిటీ, నవంబరు 27: వీఆర్వోల సమస్యలను పరిష్కరించేందుకు, సంఘం బలోపేతానికి మండల, డివిజన్, జిల్లా కార్యవర్గాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపతిరాజు రవీంద్రరాజు, అప్పలనాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 15 నుంచి 31 వరకు రాష్ట్రంలోని అన్ని మండలాల నూతన కార్యవర్గాలు, జనవరి 1 నుంచి 20 తేదీలోపు అన్ని డివిజన్ కార్యవర్గాలు, జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 లోపు 13 జిల్లాల కార్యవర్గాలు ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకుంటారని వారు పేర్కొన్నారు.