కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2021-11-23T21:24:47+05:30 IST

కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

అమరావతి: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక బుధవారం నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. కొండపల్లి మున్సిపల్ ఎన్నికపై లంచ్ మోషన్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు సీరియస్ అయింది. మధ్నాహ్నం 2:15 గంటలకు విజయవాడ సీపీ.. కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. తాము ఆదేశించినప్పటికీ ఎన్నిక ఎందుకు నిర్వహించలేకపోయారని ప్రశ్నించింది. బుధవారం ఉదయం ఎన్నిక నిర్వహించి తీరాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేస్తూ.. ఈ మేరకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అలాగే ఎన్నికైన అభ్యర్థులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని విజయవాడ సీపీని హైకోర్టు ఆదేశించింది.

Updated Date - 2021-11-23T21:24:47+05:30 IST