అమరావతి ఉద్యమంలో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు

ABN , First Publish Date - 2021-08-10T16:59:25+05:30 IST

అమరావతి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు వైసీపీ ప్రభుత్వం చూస్తోంది.

అమరావతి ఉద్యమంలో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు

విజయవాడ: అమరావతి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు వైసీపీ ప్రభుత్వం చూస్తోంది. తాజాగా అమరావతి ఉద్యమంలో పాల్గొన్న ఏడుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బేతపూడి సుధాకర్, వాడ సుధాకర్, గడ్డం మార్టిన్, కొమ్మినేని సత్యనారాయణ, రాయపాటి శైలజ కంభంపాటి శిరీష, చిలక బసవయ్యలపై 143,149, 269, 271, 341, 509 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదయింది. పోలీసులు విధించిన నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించారని, ప్రజలను ఉద్యమం వైపుకు పురిగొల్పారని పోలీసులు పేర్కొంటూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే శాంతియుతంగా తాము న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తామంటే పోలీసులు అనుమతి ఇవ్వకుండా.. నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారని వారు ఆరోపించారు. దీనిపై తాము కోర్టులో సవాల్ చేస్తామని స్పష్టం చేశారు.

Updated Date - 2021-08-10T16:59:25+05:30 IST